politics ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్ అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని తేల్చేశారు.. అలాగే కొన్ని కారణాల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని అన్నారు.. అయితే ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం నిధులను తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి కోరారు.
“ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైయస్సార్సీపి లోక్సభ పక్ష నేత మిధున్ రెడ్డి కోరారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. జాతీయ ప్రాజెక్టులా దాన్ని ముందుకు తీసుకువెళ్లడం లేదు. భూ సేకరణ చట్టం వల్ల అంచనా వ్యయం పెరిగింది. 55,548 కోట్ల రూపాయల సవరించిన అంచనా వేయానికి కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు ఇలా పెండింగ్లో ఉంచటం సరైనదిగా అనిపించడం లేదు.. ఇరిగేషన్ కాంపోనెంట్, డ్రింకింగ్ కాంపోనెంట్ అనే పేరుతో ప్రాజెక్టు నిధులకు కత్తెర పెడుతున్నారు. ఇప్పటివరకు దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టుకు ఇలాంటి షరతులు విధించలేదు కేవలం పోలవరం కు మాత్రమే ఇలాంటి కొత్త కొత్త షరతులను విధించి నిధులను తగ్గిస్తున్నారు ఈ వ్యత్యాసాన్ని వెంటనే తొలగించాలి. భూసేకరణ చట్టం కింద నష్టపరిహారాన్ని నేరుగా రైతులు ఖాతాల్లో వేయాలి. జాతీయ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మిస్ హ్యాండిల్ చేస్తుంది…” అన్నారు..