politics ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు.. ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ రెండు అవార్డులను గెలుచుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి అభినందనలు తెలిపారు
ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ టెలికన్సల్టేషన్ విభాగం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల విభాగంలో రెండు అవార్డులను గెలుచుకుంది.. ఈ అవార్డులను కేంద్రం నుంచి మంత్రి విడుదల రజిని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు అందుకున్నారు.. అనంతరం జగన్ ను కలిసి ఈ అవార్డులను చూపించారు.. ఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు..
ఈ సందర్భంగా జగన్.. ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రులు వైసిపి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చెందాయని ప్రజలకు సరైన వైద్యం అందుతుందని అన్నారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం పేదలకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని ఇంకా ముందు ముందు అన్ని సౌకర్యాలు ఏర్పరిచి ఉన్నత స్థాయి ప్రమాణాలతో మరిన్ని హాస్పిటల్స్ తీసుకొస్తామని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే తమ ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది… ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇందులో ప్రధానంగా పెన్షన్ పెంపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మంత్రి వర్గం..