దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుగా చూస్తున్న మెగా అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ రామ్ చరణ్ తేజ్ ,ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.
సరిగ్గా పదేండ్ల కింద వివాహం చేసుకున్న వీరిద్దరికి ఇన్నాళ్ళకు ఓ చిన్నారి రాబోతుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు.
శ్రీ హానుమాన్ ఆశీస్సులతో రామ్ చరణ్ ,ఉపాసన ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అని మెగాస్టార్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.