politics ఇటీవలే జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ తన పొరుగు రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా కసరత్తులు ప్రారంభించింది.. అలాగే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అలా కాకుండా ఆంధ్రాలో జనాధారణ ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడినట్టు తెలుస్తోంది..
తాజాగా తెరాస పార్టీ బిఆర్ఎస్గా పేరు మార్చుకుంది.. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో తన మద్దతు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేసింది అలాగే ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఈ పార్టీకి మద్దతు ఇవ్వగా ఏపీలో కూడా మద్దతు దొరుకుతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని అయితే జగన్ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాత నిర్ణయం ఏంటి అనేది తెలుస్తుందని చెప్పేశారు అయితే కేసీఆర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ మద్దతును పక్కనపెట్టి ఆంధ్రాలో జనాధారణ ఉన్న నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది..
ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణకు పార్టీ నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.. లక్ష్మీనారాయణతో సమావేశం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఏ పార్టీలో చేరాలి అన్నదానికి ఇంకా సమయముందని మంత్రి ఆహ్వానానికి లక్ష్మీనారాయణ బదులిచ్చినట్టు సమాచారం. అయితే.. ఇప్పటికే లక్ష్మీనారాయణ ఆమ్ ఆద్మీ పార్టీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది.