Political ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీలో జనసేన కూడా ఒకటి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన జనసేన ప్రస్తుతం తెలంగాణలోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..
తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తు చేస్తోంది. అలాగే తెలంగాణలో మనం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ జనసేన కార్యకర్తలకు ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. అలాగే తెలంగాణలో ఎన్ని స్థానాల్లో తమ పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని దీనిపై పూర్తిగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.. మంగళగిరిలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.. ఈ క్రమంలో జనసేన నేతలు అందరూ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు… ఈ మేరకు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి నేమూరి శంకర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు.
“జనసేనా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు. వీరికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తాము.. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నడుచుకునేందుకు జనసేన కార్యకర్త సిద్ధమయ్యారు.. అలాగే రాబోయే ఎన్నికల్లోనే జనసేన తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుంది అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది” అని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.