Political తెలంగాణ రాష్ట్ర సమితి తాజాగా బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను తెలంగాణ భవన్లో ఎగరవేసిన కేసిఆర్ చలో ఢిల్లీ అని నినాదం కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే, అలాగే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటుకు ఆ పార్టీ అధినేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో ఈ పార్టీ కార్యాలయం మొదలుకానుంది ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తొందరలోనే ప్రారంభం కానుంది.. ఈ
దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 14వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్.. భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయను ఈనెల 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పూజలు, యాగం నిర్వహించబోతున్నారు. అలాగే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పరిశీలించి.. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే వీటిపై కేసీఆర్ ఇప్పటికే పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది