Political హిమాచల్ ప్రదేశ్ లో తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమిని చవిచూసింది ఇప్పటికే అధికారంలో ఉన్న బిజెపిను దాటి కాంగ్రెస్ పార్టీ మెజార్టీని సాధించి త్వరలోనే అధికారాన్ని చేపట్టనుంది.. అయితే ఈ సందర్భంగా బిజెపి ఓటమికి గల కారణాలు ఏమిటి అనే విషయం వైరల్ గా మారింది..
హిమాచల్ ప్రదేశ్ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని కొనసాగించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి హిమాచల్ ప్రదేశ్ లో అధికారం మారుతూ ఉంటుంది.. అదే ఈ సంవత్సరం కూడా కొనసాగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి తన అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది..
హిమాచల్ ప్రదేశ్ లో తాజాగా జరిగిన ఎన్నికల్లో బిజెపి కేవలం 25 స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ 39 స్థానాలు గెలుచుకుంది. ఈ విధంగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుంది. మళ్లీ ఐదు సంవత్సరాలు తర్వాత బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఏమిటి అనగా మనం ఒకసారి పరిశీలించినట్టయితే బిజెపి నుంచి పది మంది రెబల్ ఎమ్మెల్యే లు పోటీ చేశారు. వాళ్లు బిజెపి ఓట్లను చీల్చరు. దీనివల్ల బిజెపి అన్నది చాలా ఇబ్బందికర పరిస్తితి ఈ ఎన్నికల్లో చూసింది. కేవలం 1000 ఓట్ల తేడాతోనే పదిమంది బిజెపి అభ్యర్థులు ఓడిపోయారు. దీనివల్ల బిజెపి రాష్ట్రంలోని అధికారానికి దూరమైంది. ఈ విషయం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని కలిగించినట్లు అయింది.