Home / POLITICS / Political : శబరిమల పోయే భక్తులకు ఎన్నో రాయితీలతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టిఎస్ఆర్టిసి..

Political : శబరిమల పోయే భక్తులకు ఎన్నో రాయితీలతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టిఎస్ఆర్టిసి..

Political టిఎస్ఆర్టిసి ఇప్పటికే ప్రయాణికుల కోసం పలు రకాల రాయితీలు ఆఫర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే అలాగే ప్రస్తుతం అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా శబరిమలకు పోతున్న సందర్భంగా వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తులు మాలధారణ చేసి ఉన్నారు అలాగే శబరిమలకు వెళ్లడానికి జనం పోటెత్తారు ఈ సందర్భంగా రైలు బస్సులు ఖాళీ లేకుండా ఉన్నాయి.. వీరి కోసం ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ స్వామిల అవస్థలను గుర్తించిన టిఎస్ఆర్టిసి ఈ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది… డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తోంది. అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధన్ ప్రక‌టించారు. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులు ఎక్కే బస్సులో ఎలాంటి డిపాజిట్ లేకుండా 10% రాయితీపై సూపర్ లగ్జరీ డీలక్స్ ఎక్స్ప్రెస్ బస్సులో ఏర్పాటు చేస్తామని తెలిపారు.. అలాగే ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట వారికి, 12 సంవ‌త్సరాలు లోబ‌డిన మ‌ణికంఠ స్వాములు, ఒక అటెండ‌ర్‌కు ఉచితంగా ప్రయాణం క‌ల్పిస్తామ‌న్నారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ప్రయాణం ఉచితంగా ఇస్తామ‌న్నారు. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి ద‌ర్శించ‌వ‌ల‌సిన పుణ్యక్షేత్రాల వ‌ర‌కు న‌డపనున్నారు. బ‌స్సుల్లో ముందస్తు సీట్ రిజర్వేషన్ కోసం శబరిమల యాత్రకు కావలసిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్‌ల‌ కోసం www.tsrtconline.in సంప్రదించాల‌ని సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat