Political తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అధికార బిజెపి నీ ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ విజయంతో ఆ పార్టీ నాయకుల్లో సందడి నెలకొంది అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి అయితే అసలు హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారు అనే విషయం ఇప్పటివరకు చర్చిని అంశంగా మారింది..
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే విషయం ప్రస్తుతం అంశంగా మారింది అయితే ఈ పదవి కోసం ఇప్పటికే ఎందరో పోటీ పడుతూ ఉండగా తాజాగా ఈ ఉత్కంఠకు తెరపడింది… రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానించిన సంగతి తెలిసిందే. దీంతో హిమాచల్ సీఎంగా సీనియర్ నాయకుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పదవిని ఆశిస్తున్న ఇతర నేతలతో చర్చించిన తర్వాత ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఏం జరుగుతుందనే విషయం తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.. అలాగే సీఎం గా ఎవరు ఎన్నికైన వాళ్ళు డిసెంబర్ 11 ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. అయితే ఈ విషయంపై సుక్వీందర్ సింగ్ ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన చేయకపోగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.