Political తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ దేశస్థాయిలో విస్తరించి బిఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే.. అలాగే తాజాగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధికార ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.. టిఆర్ఎస్ పార్టీ జెండాను తెలంగాణ భవన్లో ఎగరవేసిన కేసిఆర్ చలో ఢిల్లీ అని నినాదం కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ పార్టీ కార్యాలయం దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా టిఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుందని సమాచారం..
దాదాపు 22 ఏళ్ళ క్రితం ఏర్పాటైన టిఆర్ఎస్ పార్టీ తాజాగా టిఆర్ఎస్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే తెలంగాణ ఉద్యమ నాయకులతో పుట్టుకొచ్చిన పార్టీగా పేరుపొందిన టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ప్రజల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుంది పిన్నాలు రాష్ట్రవ్యాప్తంగా తన సేవలు అందించిన ఈ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించడానికి సిద్ధమైంది అలాగే ఆంధ్రప్రదేశ్లో తన ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అనే విషయం చర్చిని అంశంగా మారగా విజయవాడలో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.. విజయ వాడలో జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవే సమీపంలో.. 800 గజాల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. పార్టీ ఆఫీసు ఏర్పాట్ల నిమిత్తం ఈ నెల 18, 19 తేదీల్లో విజయవాడకు రానున్నారు మంత్రి తలసాని.