తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ గులాబీ దళపతి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి గత దసరా నాడు లేఖ రాసిన సంగతి విదితమే. ఆ రోజు నుండి కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు పై అభ్యంతరాల స్వీకరణకు సీఈసీ గడవు విధించిన సంగతి తెల్సిందే.
అభ్యంతరాల గడవు ముగియడంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసింది. సీఈసీ రాసిన లేఖపై సంతకం చేసి ఈ రోజు మధ్యాహ్నాం తిరిగి పంపనున్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్ లో నిర్వహించాలి.. అందుకు ఎమ్మెల్యేలు.. ఎంపీ.. మంత్రులు..ఇతర ప్రజాప్రతినిధులు.. పార్టీ ప్రతినిధులు హజరు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆవిర్భావంతో యావత్ భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది.దాదాపు 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన సైనికులు కలిసి భారతదేశ తలరాతను మార్చేందుకు నడుం బిగించారు. ‘తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకొన్నామో.. అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదాం’ అని సీఎం కేసీఆర్ దసరా రోజు పిలుపునిచ్చారు.