అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మామునూర్ 4వ బేటాలియన్ లో నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అందిస్తున్న దేహదారుడ్యా శిక్షణలో భాగంగా సుమారు 550మంది అభ్యర్థులకు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్పోర్ట్స్ దుస్తువులను అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పోలీస్ దేహాదారుడ్య పరీక్షలో ప్రతీ అభ్యర్థి అర్హత సాధించాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100రోజుల పాటు ఉచిత శిక్షణ అందించడంతో పాటు భోజన వసతితో పాటు స్టడీ మెటీరియల్ సైతం అందజేసినట్లు తెలిపారు. అనంతరం నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన సుమారు 450మంది అభ్యర్థులకు దేహాదారుడ్య పరీక్షలకు నిష్ణాతులైన బేటాలియన్ సిబ్బందితో శిక్షణ అందించడంతో పాటు వారికి పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.
శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ప్రతీ ఒక్కరూ ఉద్యోగం సాధించాలని అన్నారు. యువతకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం బేటాలియన్ కామాండెట్ శివ ప్రసాద్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.