Political ఎప్పటికప్పుడు టిడిపి నేతలపై ఆ పార్టీపై సంచలనం వ్యాఖ్యలు చేసే మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా మరోసారి టిడిపి పై వైరల్ కామెంట్స్ చేశారు.. విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభకు హాజరైన ఆయన జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చేశారు..
విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు అందరూ హాజరవుతున్నారు.. మొదటి రోజు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పలుకేలకు వ్యాఖ్యలు చేశారు అయితే అలాగే తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని బీసీ మహాసభకు హాజరై టిడిపి నాయకులు పై జూనియర్ ఎన్టీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు..
టిడిపి నాయకులు ఇప్పటికే ఎన్నో కుట్రలు చేసి ఉన్నారని అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ డిఎన్ఏ నే లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.. అందుకోసమే ఆయన మనవడైనా జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి రాకుండా ఆనసి వేస్తున్నారని అల్లుడు ఆయన చంద్రబాబు నాయుడు టిడిపికి వారసుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు.. అలాగే ఏపీని ఆక్రమించాలని ఒక కులం పన్నాగాలు పన్నుతోంది. బీసీ వర్గాలను సమూలంగా నాశనం చేయాలని కుట్ర జరుగుతోంది. టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. జోగి రమేష్ మంత్రి అయితే.. నేను, పేర్ని నాని, వల్లభనేని వంశీ మంత్రులం అయినట్టే’’ అని కొడాలి అన్నారు.