Political తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ దేశస్థాయిలో విస్తరించి బిఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే అయితే తాజాగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధికార ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి..
తెలంగాణలో ఉద్యమ నాయకులతో పుట్టుకొచ్చిన పార్టీ టిఆర్ఎస్ అయితే ఎప్పుడు 22 ఏళ్ళ క్రితం మొదలైన ఈ పార్టీ తాజాగా టిఆర్ఎస్ గా పేరు మార్చుకుంది.. రాష్ట్ర విభజన నుంచి ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి వరకు ఎంతగానో కృషి చేసింది ఈ పార్టీ… ఈ క్రమంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయ్యింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధికారిక ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ఈసీ పంపిన పత్రాలపై సంతకం చేశారు కేసీఆర్ అనంతరం తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించారు.. అలాగే టిఆర్ఎస్ కండువాను తన మెడలో వేసుకొని.. కనిపించారు… జెండా రంగు గులాబీనే కాగా.. తెలంగాణ స్థానంలో మధ్యలో భారత దేశం మ్యాప్ వచ్చి చేరింది. అయితే కారు మాత్రం జెండాలో కనిపించకపోవడం గమనార్హం.
తెలంగాణ భవన్ వద్ద భారీగా పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్, మరికొందరు ముఖ్యనేతలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పలువురు నేతలకు బీఆర్‌ఎస్ కండువాలను కప్పారు కేసీఆర్.