Political ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చిట్ఫండ్ కంపెనీలో మార్గదర్శి కూడా ఒకటి అయితే ఈ కంపెనీ తామడిగిన సమాచారం ఇవ్వలేదని అయితే తొందరలోనే ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి రామకృష్ణ..
ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చిట్ఫండ్ కంపెనీ మార్గదర్శి తాము అడిగిన సమాచారం ఇవ్వలేదని తెలిపారు ఐ సి రామకృష్ణ.. అలాగే ఏపీలో 6,868 చిట్‌ఫండ్ కంపెనీలు నడుస్తున్నాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చిట్‌ఫండ్ కంపెనీల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. చిట్‌ఫండ్ కంపెనీలకు కొత్త గైడ్‌లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే తొందరలోనే తమ కోరిన సమాచారం అందిస్తే ఎలాంటి సమస్య రాదని తెలిపారు
‘‘చిట్‌ఫండ్‌లో జరిగిన అవకతవకలపై ప్రజలను అప్రమత్తం చేశాం. తనిఖీల్లో 35 చిట్‌ఫండ్ కంపెనీల్లో అక్రమాలు గుర్తించాం. మార్గదర్శి మినహా అన్ని కంపెనీలు అడిగిన సమాచారం ఇస్తున్నాయి. మార్గదర్శి సమాచారం ఇవ్వకుండా ప్రకటనలు ఇస్తే లాభం లేదు. మేము సోదాలు నిర్వహించాక కూడా ఎలాంటి రికార్డులు ఇవ్వలేదు.. మార్గదర్శి రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం. వాళ్లు ఎక్కడ బిజినెస్ చేస్తే అక్కడ రికార్డులు ఇవ్వాల్సిందే. సెక్షన్ 19ను తెలుసుకోవాలి. ఏపీలో మోసం చేస్తే మేమే కదా చర్యలు తీసుకోవాలి’’ అని రామకృష్ణ అన్నారు. అయితే చిట్ఫండ్ కంపెనీలలో ఎప్పటికప్పుడు నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నాయని ఈ విషయంలో జరిగే అవకతవకలు తెలుసుకోవడానికి మాత్రమే సమాచారం అడుగుతున్నామని దానికి పూర్తిస్థాయిలో సహకరించాల్సిన బాధ్యత వాటి
అధినేతలపై ఉంటుందని అన్నారు