ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ఎన్నికల ఫలితాల సరళని బట్టి ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ విజయభేరి మోగిస్తోంది. దీంతో వరుసగా ఏడోసారి అధికారం దిశగా ఆ పార్టీ దూసుకుపోతోంది.
ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 182 స్థానాలకు 1,621 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.అధికార బీజేపీకి 152, కాంగ్రెస్ పార్టీకి 18, ఆప్ కి 8, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాగా మ్యాజిక్ ఫిగర్ 92. దీన్ని బీజేపీ ఇప్పటికే దాటేసింది.