Political విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతం అవుతుంది.. దీంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి..
విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభ విజయవంతమైంది.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరూ బీసీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి పలు కీలక ప్రకటనలు చేశారు.. అయితే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలకు జీర్ణం కాని విషయమే ఇది అని తెలుస్తుంది.. ఈ సభతో సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం ఎజెండాను సెట్ చేస్తున్నారు. ఇంకా సభ జరిగిన తీరు, దానిని మీడియా కవర్ చేసిన వైనం. ముందుగా జగన్ స్పీచ్‌ను గమనిస్తే ఆయన తన సంక్షేమ కార్యక్రమాల ఆధారంగానే మాట్లాడారు. అలాగే రాబోయే 18 నెలల్లో రాష్ట్రంలోనే యుద్ధమే జరగబోతుందని అన్నారు.. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీముల వల్ల అత్యధిక లబ్ధి పొందింది బీసీలేనని ఆయన తెలిపారు. నా బిసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ వర్గాలు అంటూ ఆయన ఉచ్చరించడం ద్వారా వారిని సొంతం చేసుకోవడానికి యత్నించారు. ఇప్పటికే ఆ వర్గాలలో మెజార్టీ తనవైపు ఉన్న నేపథ్యంలో ఆయన వారిని మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారు. జయహో బీసీ పేరుతో జరిగిన ఈ సభలో బీసీ వర్గాలకు చెందిన సుమారు 80 వేల మంది వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహాసభ విజయమంతం అవ్వటం టిడిపి నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టి ఇస్తున్నాయి అని చెప్పవచ్చు..