అల్లు అరవింద్ బ్యానరైన గీతాఆర్ట్స్ బ్యానర్‌ను ఆయన తండ్రి.. సీనియర్ నటుడు.. దివంగత అల్లు రామలింగయ్య 1972లో స్థాపించారు. అయితే ఈ బ్యానర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో ఒక సందర్భంలో అల్లు అరవింద్ వెల్లడించాడు. ఈ బ్యానర్ పేరు విని కొంత మంది తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదని అనుకున్నారని సరదాగా తెలిపాడు.
బ్యానర్‌కు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్‌నర్స్ ఆలోచిస్తున్నప్పుడు.. అరవింద్, గీతా ఆర్ట్స్ పేరు బావుంటుందని తెలిపాడట. గీతలో ప్రయత్నం మనది, రిజల్ట్ మన చేతిలో లేదు అనేది అర్థం వస్తుందని అన్నాడట. అది సినిమాలలో ఎక్కువగా వర్తిస్తుందని, నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే తప్ప, రిజల్ట్ మన చేతిలో ఉండదు అని అన్నాడట. అందువల్ల దీనికి గీతాఆర్ట్స్ అని పెడదాం అన్నాను అని తెలిపాడు.