తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 4,745 ఏఎన్‌ఎం సబ్ సెంటర్లు ఉండగా, ఇందులో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా అభివృద్ధి చేస్తున్నది. వీటికోసం ఇప్పటికే తొలి విడతగా 1,569 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ సర్వీసెస్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రస్తుతం నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా మరో 1,492 మంది ఎంఎల్‌హెచ్‌పీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం 3,061 పోస్టులు భర్తీ కానున్నాయి.