ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మృతితో మెయిన్‌పురి నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది.
ఆ స్థానానికి బైపోల్ నిర్వహించారు. ఎస్పీ నేత అఖిలేశ్ భార్య ఆ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్తి రఘురాజ్ సింగ్ శాక్యా పోటీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం డింపుల్ యాదవ్ 16,933 ఓట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.