Home / SLIDER / గురుకుల విద్యలో మనకు మనమే సాటి : సీఎం కేసీఆర్‌

గురుకుల విద్యలో మనకు మనమే సాటి : సీఎం కేసీఆర్‌

గురుకుల విద్యలో మనకు మనమే సాటని, ఇండియాలో పోటీగానీ, సాటిగానీ లేరన్నారు. జగిత్యాల ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు, కళాశాలలను అన్నివర్గాలకు స్థాపించుకున్నాం. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి.

ఎవరూ ఊహించనటువంటి రీతిలో 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కేంద్రం సహకరించకపోయినా నిర్మించుకుంటున్నాం. జగిత్యాలలో కాలేజీని రూ.108 కోట్లతో కళాశాల, వైద్యశాఖలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సెక్రెటరీ ఉన్నారు. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఆయనపై ఉండే గౌరవంతో ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారు.

కేరళ రాష్ట్రం కంటే బస్తర్‌ జిల్లా పెద్దగా ఉందని.. ఆరేడు జిల్లాలుగా విభజించారు. ఒకటే అసెంబ్లీ నియోజకవర్గంగా ఉందని, భౌగోళిక విస్తృతి బాగుంది.. ఏం చేయమంటారని అడిగితే.. జిల్లాలుగా చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాలకు అడ్మినిస్ట్రేషన్‌ వెలుగులు వస్తేనే.. ఆశించిన స్థాయిలో ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు’ అని కేసీఆర్‌ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat