Political ఆంధ్రాలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహా సభ ఘనంగా జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలతో పాటు ఎందరో బీసీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి బీసీల మనుగడకు అందరూ పాటుపడాలని చెప్పారు..
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ సభ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో బీసీనేతలు హాజరయ్యారు.. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు… ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినా జగన్ మహాత్మ జ్యోతి ఫూలే మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు పలువురు నేతలు..
ఈ సంద్భంగా ఏపీలో బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశంసలతో ముంచేశారు. బీసీలకు ఆత్మగౌరవాన్ని మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది సీఎం జగనే అని అన్నారు. రాష్ట్రాన్ని విజయ పథం లో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.. మాయమాటలకు లొంగిపోకుండా.. మన అభివృద్ధికి పాటుపడుతున్న నిజమైన నేత వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన బీసీ శ్రేణులకు ఆర్. కృష్ణయ్య పిలుపుఇచ్చారు. ఎన్నికల్లో కూడా తప్పకుండా వైఎస్ఆర్సిపి పార్టీని అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలందరూ ఒకే తాటి పైకి వస్తారని అన్నారు..