Political ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో బీసీ నేతలు హాజరయ్యారు.. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వచ్చారు ఇక్కడ జగన్కు ఘన స్వాగతం లభించింది..
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ మహాసభ సందర్భంగా ఇక్కడికి వచ్చినా జగన్ మహాత్మ జ్యోతి ఫూలే మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ జగన్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..
ఈ సందర్భంగా మంత్రి జోగు రమేష్.. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు ముందుందని అన్నారు. సీఎం జగన్ బలహీన వర్గాలను బ్యాక్ బోన్‌గా గుర్తించారు. చంద్రబాబు బీసీలను ఓట్ల కోసం వాడుకున్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని మంత్రి అన్నారు. ఇది చూసి టిడిపి నేతలు గల్లంత అవుతున్నారు రాబోయే మూడు దశాబ్దాల పాటు జగనే ముఖ్య మంత్రి అన్నారు.. జయహో బీసీ మహాసభ విజయవంతం కావడానికి సీఎం జగన్ సంక్షేమ పాలనే కారణమన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ గల్లంతు కావడం ఖాయం అన్నారు.
కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోబోతున్నారు. సీఎం జగన్ పాలనను బలహీనవర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అంబేద్కర్ ఆశయాలతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. బీసీలకి అండగా నిలబడిన వైఎస్ జగన్‌కి బలహీన వర్గాలు అండగా ఉంటాయి అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.