Political ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీర్వాదాలు కావాలని వెల్లడించారు..
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది అయితే ఈ విజయం అనంతరం మాట్లాడేదా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తనకు ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు చాలా అవసరమనే ఉన్నారు. ఎప్పుడు తమను ఇలాగే ఆశీర్వదించి విజయం సాధించేటట్టు ప్రోత్సహించాలని అన్నారు అరవింద్ కేజ్రీవాల్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు, కేంద్రం సహకారం అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు ఢిల్లీ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎంసీడీలో ఆప్ విజయం రాజధానిలో తొలిసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అందించిందన్నారు. మనమందరం కలిసి ఢిల్లీ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఎంసీడీని అవినీతి రహితంగా మార్చేందుకు అన్ని పార్టీలు, అభ్యర్థులు కలిసి పనిచేయాలని సూచించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేయడానికి బీజేపీ, కాంగ్రెస్ సహకారాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. ఈమేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు.