Political ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే ముఖ్యమంత్రిగా ఆయన పదవిని చేపట్టిన దగ్గర నుంచి ప్రజల కోసం ఎంతో చేస్తూ వచ్చారు ఎన్నో కార్యక్రమాలు మొదలు పెట్టడమే కాకుండా వాటిని విజయవంతంగా పూర్తి చేశారు ఆపదలో ఉన్న అందరూ చేయూతనిచ్చి ఆదుకున్నారు.. ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు అలాగే చదువుకున్న పిల్లల కోసం మధ్యాహ్నం భోజనం లో ఎన్నో మార్పులు చేసి తన మంచి మనసున్న చాటుకున్నారు.. అలాగే ఇప్పటివరకు జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు తాజాగా అలాంటి ఓ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సాయం కోసం వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో నేనున్నాంటూ భరోసా ఇస్తున్నారు. బీసీ సభను ముగించుకుని వెళ్తున్న సమయంలో తమ బిడ్డ చికిత్సకు సాయం కోసం రోడ్డుపై నిల్చున్న వారిని చూసిన సీఎం జగన్.. వెంటనే వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారికి తగిన సహాయం చేయాలని చెప్పారు.. తమ బిడ్డకు మెదడులో నరం దెబ్బ తినడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారని తల్లిదండ్రులు వివరించారు. తక్షణమే తమ బిడ్డకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ సందర్భంగా సీఎంకి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలుసుకున్న వారంతా జగన్ మంచి మనసును పొగడకుండా ఉండలేకపోతున్నారు..