ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరుగుతాయా..?. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రద్దు చేస్తారా అనే పలు అంశాల గురించి వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విధితమే. తాజాగా ఆ వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు.
విజయవాడలో జరుగుతున్న వైసీపీ జయహో బీసీ మహసభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. దాదాపు ఎనబై వేల మంది బీసీ ప్రజాప్రతినిధులు హాజరైన ఈ మహాసభకు మంత్రులు.. ఎంపీ.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూమరో పద్దెనిమిది నెలలో ఎన్నికల సమరం జరగనున్నది. ఆ లోపు ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని ప్రతి పల్లె.. గ్రామంలోని గడపగడపకు వెళ్లి గత ఐదేండ్లుగా మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అందించిన సంక్షేమ ఫలాల గురించి ఆర్ధమయ్యేలా వివరించాలి.. రానున్న ఎన్నికల్లో నూటడెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.