పరకాల నియోజకవర్గంలోని దామెరా మండలంలోని పసరగొండ గ్రామంలో రూ.20 లక్షల తో మహిళ భవనంకు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి …ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మహిళలు ఆర్ధికంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,మహిళలు ఆర్ధికంగా ఎదగాలని వారు తెలిపారు.ప్రతి గ్రామంలో మహిళ భవనంను నిర్మించుకోవాలని, నియోజకవర్గంలోనే మహిళ కోసం ఇప్పటికే 37 గ్రామాలకు మహిళ భవనంకు నిధులు కేటాయించామని, అందులో కొన్ని భవనాలు పూర్తి చేసామని, మరికొన్ని భవనాలకు పనులు జరుగుతున్నాయని తెలిపారు..పసరగొండ గ్రామ అభివృద్ధి కోసం రూ.20 లక్షలతో సి.సి.రోడ్డు పనులను నిధులు మంజూరు చేస్తామని మరియు పసరగొండ గ్రామానికి మొదటి విడతగా 25 డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేస్తామని వారు తెలిపారు..ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు…
