తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో .. స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న బుధవారం ఉదయం పదికొండు గంటలకు ఈడీ విచారణకు హజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ ను ఈడీ అధికారులు దాదాపు పదకొండు గంటల పాటు విచారించారు.
రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసులో విజయ్ దేవరకొండ ఇటీవల హీరోగా నటించిన లైగర్ మూవీకి సంబంధించి ఈడీ ఆధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో హీరోల రెమ్యూనేషన్ ఎంత ఉంటుంది..
ఈ రెమ్యూనేషన్ ఎలా తీసుకుంటారు.. మీరు నటించిన లైగర్ మూవీకి ఎంత ఖర్చు అయింది ఇలాంటి పలు [ప్రశ్నలు అడిగారు. అంతేకాకుండా విదేశాల నుండి పలువురు రాజకీయ నేతల ఖాతా నుండి ఈ సినిమా నిర్మించడానికి డబ్బులు బదిలీ జరిగినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఏడాది నవంబర్ పద్దెనిమిదిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్,హీరోయిన్ నిర్మాత అయిన ఛార్మీని సైతం ఈడీ విచారించింది.