Political తనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేయటాన్ని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య.. తాను ఇసుక తవ్వినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించి తనపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు అంటూ దుమ్మెత్తి పోశారు..
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య పై గత కొన్ని నాలుగు క్రితం విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంపై స్పందించిన సుబ్బయ్య చంద్రబాబును తీవ్రంగా విమర్శించడమే కాకుండా తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు..
“నేను దెందులూరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే లండన్ నుంచి వచ్చా. నిజయోకవర్గానికి చెందిన యువతకు వేలాది ఉద్యోగాలు ఇప్పించా. అయినా చంద్రబాబు నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.కానీ, చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దెందులూరులో రూ.1,700 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ప్రగతి యాత్రలో అదే విషయం మేం చెప్పాం. కానీ, ప్రతిపక్ష పార్టీ మితిమీరి విమర్శలు చేస్తోంది. అయినా మీ హయాంలో చేసిన ఒక్క మంచిపని చెప్పండి అంటూ బాబుకు సవాల్ విసిరారు అబ్బయ్య చౌదరి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినే.. ఈ మూడున్నరేళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన తొంభై శాతం హామీలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరవేర్చారు. కానీ, మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనత చంద్రబాబుది. సీఎంగా వైఎస్ జగన్.. ఎన్నో అభివృద్ధి .. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారని, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చేశారని.. ” అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు.