ప్రస్తుత అధునీక యుగంలో మారుతున్న జీవన శైలీ కారణంగా తాజాగా మనుషులకు హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు (బీపీ) ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృద్రోగాలకు, అకాల మరణాలకు ఇదే ప్రధాన కారకం.
ఇంత ప్రమాదకరమైన బీపీని భారత్‌లోని 75% మందికిపైగా రోగులు అదుపులో ఉంచుకోలేకపోతున్నారట. 25% శాతం కంటే తక్కువ మంది మాత్రమే దీన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారని లాన్సెట్ రీజినల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది.
ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అమెరికాలోని బోస్టన్ వర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది భారత్‌లోని రక్తపోటు నియంత్రణ రేట్లను నివేదిస్తూ 2001 తర్వాత ప్రచురితమైన 51 అధ్యయనాలను సమీక్షించి ఈ విషయాన్ని తేల్చింది. బీపీ నియంత్రణ రేట్లలో గత కొన్ని ఏండ్ల నుంచి వచ్చిన మార్పులను వారు పరిశీలించారు.