తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది. ముఖ్యమంత్రి.. అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉంది. అప్పటివరకు అందరూ ప్రజాప్రతినిధులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉండాలి..
గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పని చేయాలి.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశమిస్తాను అని చెప్పిన సంగతి విదితమే. అయితే ఈ తరుణంలో ఐదు ప్రముఖ సంస్థలు నిర్వహించిన పలు సర్వేల్లో మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని తేలింది.
మొత్తంగా తొంబై నాలుగు స్థానాల్లో ముప్పై ఐదు శాతం పైగా ఓట్లను సాధించి ప్రత్యర్థులపై స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించనున్నది. ఇందులో నలబై స్థానాల్లో యాబై శాతంకు పైగా ఓట్లు సాధించనున్నది అని ఈ సర్వేల్లో తేలింది. అయితే మిగిలిన పద్దెనిమిది నియోజకవర్గాల్లో ముప్పై శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశాయి .. మంత్రులల్లో హారీష్ రావు,కేటీఆర్ తర్వాత ఉపసభాపతి పద్మారావు గౌడ్ అత్యధిక ఓట్లు సాధించనున్నారు.