కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని తెలుగుతల్లి నగర్ లో మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా జ్యోతి రావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే అని అన్నారు. ప్రపంచానికే జ్యోతిరావు ఫూలే జీవితం ఆదర్శం అని చెప్పారు. ఫూలే విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారన్నారు.
కుల, మత రహిత సమాజ నిర్మాణానికి ఫూలే ఎనలేని కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మన్నె రాజు, సూరారం డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, నాయకులు వెంకట స్వామి, యూసుఫ్, ప్రభాకర్, రాజ్ కుమార్, తారా సింగ్, దేవి, శ్యామల రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.