సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు పూలే కలలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీసీల విద్యకు, ఉపాధికి పెద్దపీట వేశారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించారు.
మహాత్మా జ్యోతి రావు పూలేగారు ఆ రోజుల్లోనే మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, మహిళలు విద్యావంతులు కావాలనే లక్ష్యంతో తన సతీమణిని విద్యావంతురాలు చేసి, ఉపాధ్యాయురాలు చేసిన గొప్ప మహనీయులని కొనియాడారు.
ఆ మహాత్ముని స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే వారధులుగా పనిచేస్తామన్నారు.వెనుకబడిన తరగతుల విద్య, ఉపాధికి పెద్దపీట వేస్తూ వారిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపడుతున్నారని మంత్రి అన్నారు.