Home / SLIDER / మంత్రి పువ్వాడ అజయ్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు

మంత్రి పువ్వాడ అజయ్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు

నిన్న ఆదివారం ప్రగతి భవన్ లో నిజామాబాద్ అభివృద్ధి, ప్రగతి అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నేతలకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ వొకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరంగా మారింది అని ముఖ్యమంత్రి కేసిఆర్ పేర్కొన్నారు.

నిరంతరం ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన దృష్టిని కేంద్రీకరించి పని చేస్తున్నారు అని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రశంసించారు. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలని , ఖమ్మం టూరుకు వెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రావాలని అని నిజామాబాద్ అధికారులను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat