తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా హాట్ టాఫిక్ సీనియర్ నటుడు నరేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర వ్యవహారం.. ఇటీవల సీనియర్ నటుడు.. సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి విదితమే. ఇటీవల జరిగిన కృష్ణ అంత్యక్రియల సందర్భంగంలో పవిత్ర ,నరేష్ జంట చాలా సంచలనమైంది.
ఆ సమయంలో నరేష్ పవిత్రతో కాస్త అతిగా ప్రవర్తించాడంటూ చాలా మంది తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో పోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు,పలు వెబ్ సైట్లు ఈ జంట వ్యవహరించిన తీరు గురించి పలు రకాలుగా వార్తలను ప్రసారం చేశాయి.
దీంతో పవిత్ర లోకేష్ సీరియస్ అయింది. హైదరాబాద్ నగరంలో సైబర్ క్రైమ్ పోలీసులకు నటి పవిత్ర పిర్యాదు చేసింది. పిర్యాదును అందుకున్న పోలీసులు కేసును నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ ఈ సందర్భంగా వెల్లడించారు. నమోదు చేసిన కేసును ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు.