తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రిలో 56 టిఫా స్కానింగ్ మిషన్లు 20 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది..నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో రెండు టిఫా స్కానింగ్ మిషన్లను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి హరీష్ రావు గారి మార్గదర్శనంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలకు అద్బుతమైన వైద్యం అందుతుంది.. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగం బలోపేతం అయిందన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుంది.. వైద్యరంగంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల అభివృద్ధి చేస్తున్నారు. వరంగల్ తూర్పు లో సికేఎం ఆసుపత్రికి రెండు టిఫా మిషన్లు అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు..
ఈ మిషన్ల ఏర్పాటు ద్వారా గర్బిణీ స్త్రీలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ చేయించుకుంటే మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ మిషన్ల ఏర్పాటుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా మారనుంది.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగింది.. వైద్య శాఖలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అవలంబిస్తున్న విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రిలో 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్లను నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. వరంగల్ లోని సికేఎం ఆసుపత్రిలో అద్భుతంగా వైద్య సేవలు అందుతున్నాయి.మాతా శిశు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దపీట వేస్తున్నారని,కేసీఆర్ కిట్,గర్బిణీ,బాలింతలకు అంగన్ వాడి సెంటర్ల ద్వారా పౌష్టికరమైన ఆహారం అందిస్తుంది ప్రభుత్వం.. ఈ సందర్భంగా వైద్యులకు సిబ్బందికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..ఈ కార్యక్రమంలో DMHO వెంకటరమణ,కార్పోరేటర్ గందె కల్పన నవీన్,చింతాకుల సునీల్,సూపరెండెంట్,వైద్యులు,సిబ్బంది,