టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత టాస్ గె లిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 306 రన్స్ చేసింది.టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 124 రన్స్ జోడించారు.
ధావన్ 72, గిల్ 50 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పంత్, సూర్యకుమార్ కూడా త్వరత్వరగా ఔటయ్యారు. అయిదో వికెట్‌కు శ్రేయాస్, సంజూ సాంసన్ మధ్య కీలక భాగస్వామ్యం నెలకొన్నది. ఆ ఇద్దరూ 94 రన్స్ జోడించారు.అయ్యర్ 80 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.
సాంసన్ 36 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక చివర్లో వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారీ షాట్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను 16 బంతుల్లోనే 37 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక కివీస్ జట్టుకు చెందిన బౌలర్లలో టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్‌లు చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు.భారీ టార్గెట్‌ను చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది.
కివీస్ ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. కాన్వే 24, అలెన్ 22 రన్స్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం 18 ఓవర్లలో న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 80 రన్స్ చేసింది. విలియమ్సన్ 22, మిచెల్ 10 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ టిమ్ సౌథీ కీలక మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో సౌథీ ఇప్పటి వరకు 202 వికెట్లు తీశాడు. 200 వికెట్ల మైలురాయి దాటిన అయిదో కివీస్ బౌలర్‌గా సౌథీ రికార్డు క్రియేట్ చేశాడు.
India finish with a flourish to set New Zealand a challenging target ?
Watch the #NZvIND ODI series LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) ?
? Scorecard: https://t.co/KsjLsSQ2eQ pic.twitter.com/lTMKKzop36
— ICC (@ICC) November 25, 2022