Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం దాదాపు రెడీ అయ్యింది. ఈ ప్రచార రథంలోనే పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందులోనే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారని సమాచారం అందుతుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వినియోగించే బస్సు గురించి ప్రత్యేకంగా మీకోసం…
- ఈ వాహనాన్ని పవన్ సూచనలతో హైదరాబాద్ లో సిద్ధం చేశారు. ఇక్కడే వాహనాలు రెడీ అవుతుండడంతో పవన్ ఎప్పటికప్పుడు స్వయంగా వెళ్లి వాటిని పరిశీలించారు.
- ప్రచార రథం సినిమా క్యారీ వ్యాన్లా కాకుండా పొలిటికల్ మోడల్‌తో ప్రచార రథం సిద్ధం చేశారు. ఇది ఎన్టీఆర్ ఉపయోగించిన చైతన్య రథం తరహాలో ఉండటం విశేషం.
- ఈ వాహనంలో కనీసం ఆరుగురు కూర్చుని చర్చించుకునేలా కన్వెట్టబుల్ సిట్టింగ్ రూమ్ ఒకటి ఉంది. సమావేశాలకు అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో చుట్టూ చాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనంను 360 డిగ్రీలతో పరిశీలించేలా కెమెరాలు ఉన్నాయి.
- వాహనం బాడీకి రెండు వైపులా సెక్యూరిటీ గార్డులు నిలబడే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హై సెక్యూరిటీ సిస్టమ్ విత్ జీపిఎస్ ట్రాకింగ్ ఫిట్ చేసినట్లుగా తెలుస్తోంది.
- వాహనం టాప్ పైకి పవన్ చేరేందుకు లోపల నుండే పవర్ లిఫ్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ప్రజలందరికి కనిపంచేలా చిన్న డయాస్‌ను… అన్ని వైపులకు సమాన స్థాయిలో వినిపించేందుకు లేటెస్ట్ సౌండ్ సిస్టం, లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు.
- ఈ వాహనంకు మిలటరీ గ్రీన్ రంగును వేశారు.
పవన్ యాత్ర విజయ దశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు…