Kiran Kumar Reddy : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత తెరపైకి వచ్చారు. తన స్నేహితుడు సురేష్ కుమార్ రెడ్డితో కలిసి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. ఆ షో లో కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ” అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే ” షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
ఇక రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ లో బాలయ్య తన పాత స్నేహితులతో కలిసి సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ కి అతిథిలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఈ షోలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు కిరణ్ కుమార్ రెడ్డి.
ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ప్రస్తుతం అన్ని దగ్గర ఉండడమే అవసరం” అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. లీడర్స్ అంతా తప్పకుండా లెజిస్లేటివ్ క్యాపిటల్ లో, ఆఫీసర్స్ అంతా ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ లో ఉండాలి. అయితే కోర్ట్ లో ఏదైనా ఫైల్ చేయాలంటే ఆఫీసర్స్ కి మినిస్టర్స్ అండ్ సీఎం అనుమతి కావాల్సిందే. మనకి ఎప్పుడు కూడా అనుకూలత అనేది ముఖ్యం. కాబట్టి మూడు కలిసుంటేనే మంచిది అంటూ కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.