Minister Sathyendar : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి… తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ ఇటీవల సీసీ టీవీ ఫుటేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మరి సంచలనంగా మారాయి. సత్యేందర్ కు మసాజ్ చేస్తున్న వీడియోపై బీజేపీ సహా పలు పార్టీల నేతల ఆప్ పై విమర్శలు కురిపించారు. ఈ క్రమం లోనే ఇప్పుడు తాజాగా మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చి మరింత చర్చనీయాంశంగా మారింది.
సత్యేందర్ జైన్ ఉన్న లాక్-అప్ లో బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. తాను ఆరు నెలలుగా జైలులో ఒక్క గింజ కూడా తినలేదని బయటినుంచి తెచ్చిన ఆహారాన్ని కూడా స్వీకరించలేదని ఆప్ నేత జైన్ కోర్డులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన వీడయో దానిని బట్టబయలు చేసింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సత్యేందర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌లో గత 6 నెలలుగా తనకు వండిన ఆహారం, ఆహార పదార్థాలు ఇవ్వలేవని పేర్కొంది.
జైన్ తన పిటిషన్‌లో తాను జైన మతాన్ని ఆచరిస్తున్నందున ఇలా జరిగిందని వివరించారు. తన మతం ప్రకారం.. మొదట ప్రార్థనలు చేయకుండా వండిన ఆహారాన్ని తినడానికి అనుమతించరని జైన్ చెప్పారు. జైల్లో సరిగా భోజనం చేయకపోవడం వల్ల 28 కేజీల బరువు తగ్గానని చెప్పారు. అయితే, తీహార్ జైలు వర్గాల సమాచారం ప్రకారం జైన్ జైలులో 8 కిలోల బరువు పెరిగారని అంటున్నారు. ఈ విషయం కాస్త ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.
सुना है सत्येंद्र जैन की जेल में ख़ाना रेडिसन और ताज से आता है लेकिन वकील कह रहे है की 28 किलो वजन कम हो गया है भाईसाब का । pic.twitter.com/2G4gAV5cW8
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) November 23, 2022