తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, తల్లడ పిఎసిఎస్ ఆధ్వర్యంలో రైతుల పండించిన ధాన్యం కొనుగోలు చేయుట కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, జిల్లా అదన కలెక్టర్ మధుసూదన్ గారు ప్రారంభించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మద్దతు ధర కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి అన్నారు.
