రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పండించిన ప్రతీ గింజను మద్దత్తు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.వర్దన్నపేట మండల కేంద్రంలో ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును రాజు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారని వెల్లడించారు.
రైతులకు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తుందని అన్నారు. మొదటి రకం వరి ధాన్యానికి రూ.2060, రెండవ రకానికి రూ. 2040 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో వేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకు విలువ ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.