తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ చీఫ్ విప్ నకు శాలువా కప్పి సన్మానించారు. జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా వినయ్ భాస్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
