ఇండియాతో జరుగుతున్న మూడవ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్. వర్షం వల్ల టాస్‌ను అరగంట ఆలస్యంగా వేశారు. ఇండియా జట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్‌ను తీసుకున్నారు. తొలి టీ20 వర్షం వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే. ఇక రెండవ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
