బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ మీడియా కథనాల ప్రకారం మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఓ పూజా ఊరేగింపు కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో నిలబడి ఉండగా.. వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది.
ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాజీపూర్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు.
वैशाली के देसरी थाना क्षेत्र में तेज रफ्तार ट्रक द्वारा बच्चों सहित कई लोगों को कुचलने की घटना से मर्माहत हूं। मृतकों के परिजनों के प्रति गहरी संवेदना है तथा उन्हें 5-5 लाख रू० अनुग्रह अनुदान दिया जाएगा। घायलों के समुचित इलाज का निर्देश दिया। उनके शीघ्र स्वस्थ होने की कामना है।
— Nitish Kumar (@NitishKumar) November 20, 2022