Himanshu Rao : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గురించి అందరికీ తెలిసిందే. గతంలో అధిక బరువు కారణంగా అనేక సార్లు బాడీ షేమింగ్‌కు గురయ్యాడు హిమాన్షు. భారీ శరీరాకృతితో కనిపించే హిమాన్ష్‌పై ఆన్‌లైన్‌లో, కొందరు రాజకీయ నాయకులు కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో తీవ్రంగా స్పందించి… తన కుమారుడిపై కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అయితే ఇటీవల బరువు తగ్గిన హిమాన్షు తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కాగా ఇటీవల తన మిత్రులతో కలిసి ఫార్ములా వన్ రేస్ జరుగుతున్న చోటుకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. షార్ములా వన్ రేసు చూడటానికి వెళ్లిన హిమాన్షు రోడ్డు పక్కనే ఉన్న చిన్న బుట్ట వ్యాపారి దగ్గరకు తన మిత్రులతో కలిసి వెళ్లాడు. తనతో పాటు తన మిత్రులకు కూడా బేల్‌పురి కొనిచ్చాడు. ఇందుకు గానూ కొంత డబ్బును చిరు వ్యాపారికి ఇచ్చాడు. ఆ తర్వాత తన వ్యాపారం ఎలా జరుగుతుందో అని వ్యాపారిని అడిగి తెలుసుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి రేస్ జరుగుతున్న దగ్గరకు ప్రయాణం అయ్యాడు. ఈ నేపథ్యంలో అతన్ని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో చుట్టు ముట్టదాంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. హిమాన్షు తో సెల్ఫీలు దిగాలని అందరూ ఎగబడ్డారు అయిన కానీ హిమాన్షు ఏమాత్రం ఇబ్బంది పడకుండా వారితో ఒపిగ్గా సెల్ఫీలు దిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.