ఇటీవల విడుదలైన ప్రభంజనం సృష్టించిన చిన్న మూవీ ‘కాంతార’ హవానే ఇంకా నడుస్తుంది. ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజవుతున్నా కూడా ఈ చిత్రానికి ఆధరణ తగ్గడం లేదు. కొత్త సినిమాలకు సమానంగా కలెక్షన్లు సాధిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో రిలీజైన ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15న రిలీజైంది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ రిలీజ్ చేశాడు. తెలుగులో రెండు కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం మొదటి రోజే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు సినీ చరిత్రలోనే అలా రిలీజైన మొదటి రోజే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమా లేదు.
ఇదిలా ఉంటే ఈ చిత్రం తెలుగులో మరో అరుదైన ఘనతకు దగ్గరలో ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం తెలుగులో రూ.65.50 కోట్ల వరకు కలెక్షన్‌లు సాధించింది. కలెక్షన్‌ల పరంగా చూసుకుంటే తెలుగులో అత్యధికంగా వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలలో కాంతార నాల్గొవ స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో కేజీఎఫ్(రూ.185 కోట్లు), రోబో(రూ.100 కోట్లు), రోబో 2.౦( రూ.72 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. ఇక కాంతార మరో రూ.7 కోట్లు సాధిస్తే రోబో 2.౦ రికార్డు బ్రేక్ చేసి టాప్-3 ప్లేస్‌లో నిలుస్తుంది.
అయితే ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో భేదియా సినిమాను గీతాఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది. దాంతో కాంతారకు థియేటర్‌ల సంఖ్య భారీగా తగ్గనుంది. ఒక వేళ భేదియాకు నెగెటీవ్ టాక్ వస్తే.. కాంతారకు తిరిగి థియేటర్‌లు వచ్చే చాన్స్ ఉంది. కానీ భేదియాకు పాజిటీవ్ టాక్ వస్తే కాంతార దాదాపు థియేటర్‌లలో నుండి వెళ్లిపోయినట్లే. ఏమున్నా రానున్న నాలుగు రోజుల్లోనే ఈ చిత్రానికి అ రికార్డు సాధించే చాన్స్ ఉంది.