సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా చిత్ర బృందం మేకింగ్ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకుంది.
వీడియోలో సూపర్ స్టార్ రజినీకాంత్ అదిరిపోయే లుక్ లో కనిపించారు.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Here’s a glimpse of Superstar @rajinikanth from the sets of #Jailer ?
@Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/3EtAap0FUs
— Sun Pictures (@sunpictures) November 18, 2022