తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మున్సిపాలిటీ 1 వార్డు పరిధిలోని ఈదులపూసపళ్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ .ఈ సందర్బంగా ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు సీఎం కేసీఆర్ గారని ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ అన్నారు.
రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు రుణ మాఫీ, రైతు బందు, రైతు భీమా, నియంత్రిత పంట సాగు, రైతు వేదికల నిర్మాణం, ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఏఈవో ల నియామకం వంటి అనేక రైతు సంక్షేమ పథకాలను తెచ్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పట్టణ, మరియు మండల ప్రజాప్రతినిధులు, స్థానిక గ్రామ ప్రజాప్రతినిధులు, మండల గ్రామ తెరాస ముఖ్యనాయకులు, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు