నేడు బంగారం ధర భారత్ బులియన్ మార్కెట్లో పరుగులు పెడుతోంది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర నేడు మాత్రం షాకిచ్చింది. ఈ నెలలో ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇది రెండో సారి. దీపావళి తర్వాత నుంచి బంగారం ధర చాలా తక్కువ రోజులు మినహా మొత్తంగా పెరుగుతూనే ఉంది.
నేడు అంటే నవంబర్ 18న దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.750 వరకు పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.820 వరకు పెరిగింది. ఇక వెండి ధర మాత్రం కొన్ని నగరాల్లో స్థిరంగా ఉండగా.. మరికొన్ని నగరాల్లో మాత్రం తగ్గింది.